ETV Bharat / city

నూతన సంవత్సరం.. అంబరాన్నంటిన సంబరం - రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలు

రాష్ట్రంలో చిన్నా పెద్దా అంతా కలిసి ఉత్సాహంగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు. యువత రోడ్లపైకి వచ్చి సందడి చేశారు. కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. కేకులు కట్​ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు.

నూతన సంవత్సరం.. అంబరాన్నంటిన సంబరం
నూతన సంవత్సరం.. అంబరాన్నంటిన సంబరం
author img

By

Published : Jan 1, 2020, 10:21 AM IST

ఉత్సాహంగా నూతన సంవత్సర సంబరాలు

రాష్ట్రవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. యువత కేరింతలతో సందడి చేశారు. నెల్లూరులోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో యువత రోడ్లపైకి వచ్చి ఉత్సాహంగా వేడుకలు చేసుకున్నారు. అయితే మద్యం తాగి వాహనాలు నడపకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కానిస్టేబుల్​ నుంచి ఎస్పీ వరకూ రోడ్లపై తనిఖీలు చేశారు.

అనంతలో సెల్ఫీలతో వేడుకలు

అనంతపురంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని టవర్​ క్లాక్​ వద్ద పోలీసుల ఆధ్వర్యంలో డీఎస్పీ కేక్​ కట్​ చేసి కొత్త ఏడాదిని ఆహ్వానించారు. యువత రోడ్లపై పెద్ద ఎత్తున సందడి చేస్తూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు. సెల్ఫీలు దిగుతూ వేడుకలు చేసుకున్నారు.

ప్రకాశంలో ఘనంగా

ప్రకాశం జిల్లా ఒంగోలులో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అంతా ఉత్సాంహంగా రోడ్లపైకి వచ్చి సందడి చేశారు. కొత్త ఏడాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

తూర్పుగోదావరిలో

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఆర్​సీ సేవా సంస్థలో జరిగిన వేడుకల్లో కొత్తపేట ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్థానిక వృద్ధాశ్రమంలో ఎమ్మెల్యే కేక్ కట్ చేసి వృద్ధుల నడుమ నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో యువకులు ఉత్సాహంగా కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించారు.

విజయనగరంలో ఉత్సాహంగా

విజయనగరం జిల్లాలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నా, పెద్దా అంతా ఒకచోట చేరి సందడి చేశారు. నగరంలోని కాలనీల్లో మహిళలు, పిల్లలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు చేపట్టారు.

విశాఖలో ఘనంగా

సాగరతీరం విశాఖలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. బీచ్​ రోడ్డు జనంతో కిక్కిరిసిపోయింది. యువత ఉత్సాహంగా ఈలలు వేస్తూ సందడి చేశారు. కేక్​ కట్​ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి:

ఈ కొత్త సంవత్సరం.. కొంగొత్త కానుకిద్దాం!

Intro:Ap_Nlr_01_01_New_Year_Vedukalu_Kiran_Av_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నూతన సంవత్సర వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో యువత రోడ్లపైకి వచ్చి కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. కేకులు కట్ చేస్తూ, బాణసంచా కాలుస్తూ పరస్పరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మద్యం తాగి వాహనాలు వేగంగా నడపకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు రోడ్లపై తనిఖీలు నిర్వహించారు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.