రాష్ట్రంలో కొత్తగా గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఈఎస్‌ఐ ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు, నెల్లూరు శ్రీసిటీ అనంతపురం పెనుకొండలో వంద పడకలతో... కర్నూలు, శ్రీకాకుళంలో 30పడకలతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. కొన్నింటికి భూకేటాయింపులు పెండింగ్‌లో ఉండగా.. మరికొన్నింటికి ఈఎస్‌ఐ కార్పొరేషన్ అనుమతులు లభించాల్సి ఉందని సంచాలకుడు రాజేంద్రకుమార్ తెలిపారు.
విశాఖ గ్రామీణంలోని అచ్యుతాపురం సెజ్‌లో 30పడకలతో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రికి త్వరలోనే అనుమతులు రానున్నాయని పేర్కొన్నారు. కాకినాడ, విజయనగరం ఆసుపత్రులకు శంకుస్థాపన చేయగా.. పనులు ప్రారంభించాల్సి ఉందని, రాజమండ్రిలో నిర్మాణంలో ఉన్న ఆస్పత్రిని 50 నుంచి 100పడకలకు పెంచనున్నట్లు తెలిపారు. విజయవాడలోని 110 పడకలను 250కి పెంచేందుకు ప్రతిపాదించామని.. ఇందులో 50పడకలు సూపర్ స్పెషాల్టీకి ఉంటాయని, వీటి నిర్మాణం పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆ డబ్బుతోనే... ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు మంచి చేస్తున్నాం: సీఎం జగన్