నూతన డీజీపీగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి.. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో సీఎంతో ఆయన సమావేశమయ్యారు.
కడప నుంచి డీజీపీగా..
AP New DGP Kasi reddy rajendranath reddy: కొత్త డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డిది కడప జిల్లా రాజుపాలెం మండలంలోని పర్లపాడు గ్రామం. 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. 1994లో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఏఎస్పీగా మొదటి పోస్టింగ్‌లో బాధ్యతలు చేపట్టారు. 1996లో వరంగల్ జిల్లా జనగాంలో ఏఎస్పీగా, అనంతరం వరంగల్ ఏఎస్పీగానూ పని చేశారు. 1996-97 వరకు కరీంనగర్లో ఆపరేషన్స్ ఏఎస్పీగా విధులు నిర్వర్తించారు.
1997-99లో విశాఖ రూరల్ ఎస్పీగా అనంతరం సీఐడీ ఎస్పీ, గుంతకల్లు రైల్వే ఎస్పీ, విజయవాడ రైల్వే ఎస్పీగా రాజేంద్రనాథ్ రెడ్డి పని చేశారు. అక్కడ నుంచి నెల్లూరు ఎస్పీ, హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా విధులు నిర్వర్తించారు. 2006-08 వరకు ఎక్సైజ్ శాఖలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. 2008-10 వరకు విజయవాడ సీపీ, 2010-11 వరకు ఎన్ఫోర్స్మెంట్ డీఐజీ, ఐజీగా విధులు చేపట్టారు. 2011-13 వరకు నార్త్ కోస్టల్ ఐజీగా, 2013-14 వరకు హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీగా, 2015-17 వరకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా పని చేశారు.
2018-19 వరకు డ్రగ్ కంట్రోల్ డీజీగా బాధ్యతలు చేపట్టారు. 2019-20 వరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా.. 2020 నుంచి ఇంటెలిజెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు చేపట్టారు. తాజాగా డీజీపీగా అదనపు బాధ్యతలను ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి:
BONDA UMA: వివేకా హత్య కేసులో నిందితులను కాపాడేందుకు సీఎం ప్రయత్నం: బొండా ఉమా