ap corona cases : రాష్ట్రంలో గత 24 గంటల్లో 14,788 సాంపిల్స్‌ను పరీక్షించగా 86 మందికి కొవిడ్ సోకినట్లు గుర్తించారు. కొత్తగా 288 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,341 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Corona cases in India: దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 6,561 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 14,947 మంది కోలుకోగా.. 142 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 77,152గా ఉంది.
- మొత్తం కేసులు: 42,938,599
- మొత్తం మరణాలు: 5,14,388
- యాక్టివ్ కేసులు: 77,152
- కోలుకున్నవారు: 4,23,53,620
Vaccination in India: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. బుధవారం మరో 21,83,976 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,78,02,63,222కు చేరింది.
World Corona cases: ప్రపంచవ్యాప్తంగా 15,78,230 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,402,74,905కు చేరింది. కొత్తగా 7733 మంది ప్రాణాలు కోల్పోవడం వల్ల మొత్తం మృతుల సంఖ్య 5,992,271కు చేరుకుంది. మరోవైపు కోలుకున్న వారి సంఖ్య 19,07,368గా ఉంది.
- జర్మనీలో కొత్తగా 1,98,457 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 255 మంది కరోనాకు బలయ్యారు.
- అమెరికాలో కొత్తగా 49,729 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా మరో 1,778 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో తాజాగా 97,455 కరోనా కేసులు నమోదయ్యాయి. 784 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో కొత్తగా 30,995 మందికి వైరస్ సోకగా.. 335 మంది మృతిచెందారు.
- ఫ్రాన్స్‌లో 57697 కొత్త కేసులు వెలుగుచూశాయి. కరోనా మహమ్మారి ధాటికి మరో 186 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి : దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు