కరోనా నిబంధనలతో తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు 25వరకు సాగుతాయని వెల్లడించారు. దేవస్థాన అనుబంధ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు చెప్పారు.
నవరాత్రులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో తెలిపారు. ఉత్సవ పూజలో పాల్గొనేందుకు రూ.1,116, ఒక్కరోజు సప్తశతి పారాయణానికి రూ.116, లక్ష కుంకుమార్చనలో పాల్గొనేందుకు రూ.116 చొప్పున టికెట్ ధర నిర్ణయించినట్లు పేర్కొన్నారు. బాలాలయంలో అమ్మవారి ప్రతిష్టకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీచదవండి