ETV Bharat / city

జీవో 35ను అమలు చేయాలని నట్టి కుమార్ పిటిషన్ - హైకోర్టు తాజా వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల విషయంలో ఇచ్చిన జీవో 35ను నిలిపేయాలని నిర్మాత నట్టి కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ అంశంపై విచారణ జరిపారు.

nattikumar petition on go 35
nattikumar petition on go 35
author img

By

Published : Oct 6, 2021, 6:55 AM IST

సినిమా టికెట్ల ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 8న ఇచ్చిన జీవో 35 అమలు కోసం నిర్మాత, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఆగస్టు 5 న తాను ఇచ్చిన వినతిని పరిగణనలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ వ్యాజ్యంపై విచారణ జరిపి .. జీవో 35, ఏపీ సినిమాలు (క్రమబద్ధీకరణ) చట్టంలోని సెక్షన్లు 9,10,11 లకు అనుగుణంగా పిటిషనర్ ఇచ్చిన వినతిపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి, విశాఖపట్నం సంయుక్త కలెక్టర్, అనకాపల్లి ఆర్డీవోను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

ఇదీ చదవండి: Judges Transfers: హైకోర్టు జడ్జీల బదిలీ.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు నియామకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.