కరకట్ట వెంట ఇసుక తవ్వకాలు నిలిపేయాలి’’ అని జూన్ 12న ‘ఈనాడు,ఈటీవి భారత్ ’లో ప్రచురితమైన కథనాలపై జాతీయ హరితట్రైబ్యునల్ (నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్) చెన్నై బెంచ్ సుమోటోగా విచారణ చేపట్టింది. నిబంధనలు పాటించకుండా ఇక్కడ ఇసుక తవ్వుతున్నట్లు ఆ కథనంలో పేర్కొన్నందున మొత్తం వ్యవహారంపై ఈ నెల 28వ తేదీలోపు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులనిచ్చింది.
కృష్ణా నదిలో అశాస్త్రీయంగా ఇసుక తవ్వి, వ్యవసాయ పొలాల్లో దాన్ని పోస్తున్నందున కరకట్ట బలహీనమవుతోంది. భారీ వర్షాలు వచ్చినప్పుడు కట్ట తెగి వ్యవసాయ పొలాలు, రాజధాని ప్రాంతంలోకి వరద వచ్చే అవకాశం ఉంది. ఇసుక తవ్వకం చేపట్టడానికి ముందు సీఆర్‌డీఏ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవడంతోపాటు, ఆ పనులను కరకట్ట బలహీనం కాకుండా శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టాలని ఈనాడు, ఈటీవి భార లో కథనం వచ్చింది. ఇక్కడ పర్యావరణపరంగా పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నందున ట్రైబ్యునల్ జోక్యం అత్యవసరమని భావించి ఈ అంశాన్ని విచారణకు స్వీకరిస్తున్నాం. ఇందులో ప్రతివాది అయిన ఏపీ సీఎస్‌తోపాటు, ఈ అంశంతో సంబంధం ఉన్న వివిధ అధికారులకు ‘ఈనాడు’ కథనం జతచేసి, నోటీసులు జారీచేయాలని ఆదేశించాం. అందువల్ల ఎన్జీటీ ఇదివరకు జారీచేసిన ఆదేశాల అమలుకు సంబంధించిన నివేదికలను మాకు సమర్పించాలి’’అని ఎన్జీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండీ.. దేశంలో భారీగా పెరిగిన విద్యుత్తు డిమాండ్