పరీక్షల పేరిట విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడాలనుకుంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హెచ్చరించారు. విద్యావేత్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో 'ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు-విద్యా సంవత్సరం వృథా' అనే అంశంపై చర్చించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్‌తో ఆటలొద్దని హితవు పలికారు. ఇప్పటికే వారంతా తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సురేష్ రోజుకో విధంగా మాట్లాడుతున్నారని.. ఆయన అయోమయశాఖ మంత్రిలా ఉన్నారని ఎద్దేవా చేశారు. మూడో దశ ప్రారంభం కాకముందే పిల్లలపై కరోనా తీవ్రత కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి..
cross firing: మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు.. ఆరుగురు మృతి?!