మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవంతో మంత్రిగా, శాసనసభ స్పీకర్గా కోడెల శివప్రసాదరావు రాష్ట్రానికి సేవలందించారని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొనియాడారు. నేడు కోడెల జయంతి సందర్భంగా నివాళులర్పించారు. రాజకీయాల్లో ఉంటూనే వైద్యునిగా తన వృత్తిని వదలకపోవడం ఆయనలోని సేవా దృక్పథానికి నిదర్శనమని ట్వీట్ చేశారు. సభాపతిగా హుందాగా, నిష్పక్షపాతంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు.
ఇవీ చదవండి: