ETV Bharat / city

రాష్ట్రంలో జగన్ రౌడీ రాజ్యం నడుస్తోంది: లోకేశ్

సీఎం జగన్​పై తెదేపా నేత నారా లోకేశ్​ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జగన్ రౌడీ రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ఎస్సీలపై జగన్ ప్రభుత్వం దమనకాండ కొనసాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

nara lokesh
nara lokesh
author img

By

Published : Aug 30, 2020, 12:47 AM IST

రాష్ట్రంలో జగన్ రౌడీ రాజ్యం నడుస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. రోజుకో ఎస్సీపై దాడి చెయ్యందే వైకాపా నాయకులకు నిద్ర పట్టడం లేదని మండిపడ్డారు. అనంతపురం జిల్లా, యాడికి మండలంలో రోడ్డు మరమతుల పని చేస్తున్న ఎస్సీ వర్గానికి చెందిన రాజు, ఇంజినీర్ పఠాన్ జమీర్​పై వైకాపా నాయకుడు రమేశ్ అమానుషంగా దాడి చేసి దుర్భాషలాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్​లో పోస్ట్ చేశారు.

  • రాష్ట్రంలో @ysjagan రౌడీ రాజ్యం నడుస్తుంది. రోజుకో దళితుడిపై దాడి చెయ్యందే వైకాపా నాయకులకు నిద్ర పట్టడం లేదు. అనంతపురం జిల్లా, యాడికి మండలంలో రోడ్డు మరమత్తు పని చేస్తున్న దళితుడైన రాజు, ఇంజినీర్ పఠాన్ జమీర్ పై వైకాపా నాయకుడు రమేష్ అమానుషంగా దాడి చేసి దుర్భాషలాడాడు.(1/2) pic.twitter.com/QhmigHfyno

    — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

శిరోముండనం, చంపడం, వేధింపులు, దాడులకు పాల్పడుతూ దళితులపై జగన్ ప్రభుత్వం దమనకాండ కొనసాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలపై దాడులకు దిగుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

విశాఖ సాగర తీరంలో బయటపడిన యుద్ధ బంకర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.