ఏప్రిల్ 20న తెలుగుదేశం అధినేత చంద్రబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా నారా లోకేశ్ ట్విట్టర్లో జన్మదిన పోస్టర్ను విడుదల చేశారు. అధినేత పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. అధినేత పిలుపు మేరకు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా వేడుకలు నిర్వహించరాదని కార్యకర్తలు, అభిమానులను లోకేశ్ సూచించారు. కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తమను తాము రక్షించుకుంటూ.. కుటుంబాలను కాపాడుకోవాలని లోకేశ్ అన్నారు.
ఇదీ చదవండి: