ETV Bharat / city

'వైకాపా నేతలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు' - nara lokesh latest news

రాష్ట్ర ప్రభుత్వంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. "ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసిన వైకాపా నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు. అధికారంతో వైకాపా నాయకుల కళ్లు నెత్తికెక్కాయని మండిపడ్డారు. ఉద్యోగులకు రక్షణ కల్పించాలన్నారు.

Nara Lokesh Fires on YCP over attack on employees
నారా లోకేశ్ ట్విట్
author img

By

Published : Sep 5, 2020, 4:52 PM IST

Nara Lokesh Fires on YCP over attack on employees
నారా లోకేశ్ ట్విట్

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ దౌర్జన్యకాండ కొనసాగుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "వైకాపా గూండాలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. కర్నూలు జిల్లా మండిగిరిలో వైకాపా నేత కల్లుబోతు సురేష్.. గ్రామ సచివాలయ ఉద్యోగులపై దుర్భాషలాడుతూ... భౌతికదాడి చేశాడు" అని లోకేశ్ ఆరోపించారు.

చెప్పిన పని చెయ్యలేదని ప్రభుత్వ ఉద్యోగి చెంప పగలకొట్టడానికి ఎంత ధైర్యమని నిలదీశారు. "అధికార మదంతో వైకాపా నాయకుల కళ్లు నెత్తికెక్కాయి" అని మండిపడ్డారు. ఏవోపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. దాడికి సంబంధించిన వీడియోను ట్విటర్​లో పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలన్నారు.

ఇదీ చదవండి:

'తహసీల్దార్ల కార్యాలయాలపై అనిశా వరుస దాడులు సరికాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.