ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఫేక్ ట్వీట్లతో ఆవేశ పడుతున్నారంటూ.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ ఐదు రూపాయిల కోసం నికృష్టపు పనులు చేస్తూ బరితెగిస్తున్నారని మండిపడ్డారు.
ఈ ఫేక్ బతుకులకు స్వస్తి పలికాలని హితువు పలికారు. వారు మొదలుపెట్టిన మూడు ముక్కలాటతో సాధించింది ఏంటని నిలదీశారు. మూడు ప్రాంతాల్లో ఏం అభివృద్ధి చేశారో ఏడాదిగా ఏం చేశారో చెప్పాలని పేటీఎం బ్యాచ్.. తమ అధినేత జగన్ రెడ్డిని నిలదీస్తే మంచిదన్నారు.
ఇదీ చదవండి: