గత ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయని వారికి రాష్ట్రంలో జీవించే హక్కు లేదన్నట్లు ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. ప్రతిరోజూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తూ ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. కరోనాపై సామాజిక కార్యకర్తలు పోస్టులు పెడితే వారి పట్ల ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించిందన్నారు. కోర్టు ఆదేశాలను పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు.
ఇదీ చదవండి: 'ప్రభుత్వం రద్దవుతుందనే భయంతోనే.. అసెంబ్లీ సమావేశం'