ETV Bharat / city

మంటగలిసిన మానవత్వం.. శ్మశానంలో కరోనా బాధితులు! - corona deaths in nagarkurnool district

కరోనా మానవ బంధాలతో పాటు మనుషుల్లోని మానవత్వాన్ని దూరం చేస్తోంది. వైరస్ సోకకుండా బాధితుల నుంచి దూరం ఉండమంటే.. కొన్నిప్రాంతాల్లో మాత్రం కరోనా బాధితులను అంటరానివారిగా ఊళ్లో నుంచి వెలివేస్తున్నారు. ఓవైపు మహమ్మారి సోకిందనే భయం.. మరోవైపు తలదాచుకోవడానికి కాస్త చోటు లేక కొవిడ్ రోగులు నానాఅవస్థలు పడుతున్నారు.

మంటగలిసిన మానవత్వం.. శ్మశానంలో కరోనా బాధితులు

author img

By

Published : May 23, 2021, 11:45 AM IST

తెలంగాణలోని నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం యన్మన్​బెట్ల గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. ఆ కుటుంబం నివసించే ఇంట్లో ఒకే గది ఉండటం వల్ల మిగతా వారికి వైరస్ సోకకుండా.. గ్రామ సర్పంచ్ కరోనా బాధితులిద్దర్ని ప్రభుత్వ పాఠశాలలో ఉంచారు.

పాఠశాల చుట్టూ నివసించే గ్రామస్తులంతా.. కరోనా బాధితులను అక్కడ ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కణ్నుంచి వెళ్లిపోమని బెదిరించారు. దిక్కుతోచని స్థితిలో కొవిడ్ రోగులు.. శ్మశానవాటికకు వెళ్లారు. వైకుంఠ ధామంలో ఎలాంటి వసతులు లేకున్నా.. బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉన్నారు. మీడియా సహకారంతో గ్రామ సర్పంచ్​ గ్రామస్థులకు నచ్చజెప్పి.. వారిని తిరిగి పాఠశాలకు చేర్చారు.

కరోనా మహమ్మారి సోకి ఓవైపు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న బాధితులు.. కొన్ని ప్రాంతాల్లో ప్రజల తీరుతో ఇలా మానసిక వేదనకు గురవుతున్నారు.

ఇదీ చదవండి:

ఒకే రోగిలో బ్లాక్​, వైట్​ ఫంగస్​ గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.