నాగార్జున సాగర్ జలాశయం ఎగువ నుంచి భారీగా వరద రావడంతో ప్రాజెక్టుకి 6 లక్షల 79 వేల క్యూసెక్కుల వరద నీరు చేరింది. దీంతో సాగర్ 20 గేట్లను 25 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
- సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులు
- ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312.04 టీఎంసీలు, ప్రస్తుత నీటి సామర్థ్యం 309.05 టీఎంసీలు
- ఇన్ ఫ్లో 6 లక్షల 79 వేల క్యూసెక్కులు కాగా అంతే మొత్తంలో ఔట్ ఫ్లో వెళ్తోంది.
గేట్లను ఎత్తి వేయడం ద్వారా దిగువన ఉన్న పుష్కరఘాట్లోని శివాలయం మెట్ల వరకు వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి: ఈనెల 19 నాటికి మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం