ETV Bharat / city

Kusum project: తొలిసారి 350 మెగావాట్ల కుసుమ్‌ ప్రాజెక్టులు

వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా కోసం పీఎం కుసుమ్‌ పథకం కింద 350 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మొదటిసారి మంజూరు చేసింది. దీని ద్వారా 50 వేల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లను సౌర విద్యుత్‌ పరిధిలోకి తేవాలని కేంద్రం పేర్కొంది.

power
power
author img

By

Published : Jul 16, 2021, 9:15 AM IST

వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా కోసం పీఎం కుసుమ్‌ పథకం కింద 350 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మొదటిసారి మంజూరు చేసింది. దీని ద్వారా 50 వేల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లను సౌర విద్యుత్‌ పరిధిలోకి తేవాలని కేంద్రం పేర్కొంది. ఈ పథకం కింద గరిష్ఠంగా 10 మెగావాట్ల ప్రాజెక్టుల వరకు మాత్రమే అనుమతిస్తుంది. ఒక్కో మెగావాట్‌కు రూ.3.4 కోట్ల చొప్పున ప్రాజెక్టు వ్యయంలో 30% రాయితీగా అందిస్తుంది. దీని ప్రకారం మెగావాట్‌కు రూ.1.05 కోట్ల రాయితీ వస్తుంది.

ఏపీఈఆర్‌సీ నుంచి ఆమోదం.....

రాష్ట్రంలో 350 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ సంస్థ (ఏపీఈఆర్‌సీ) ఆమోదం తెలిపింది. ఈమేరకు టెండర్లు పిలవడానికి నెడ్‌క్యాప్‌ మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారితో డిస్కంలు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) కుదుర్చుకుంటాయి. ఫీడర్ల వారీగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల డిమాండ్‌ను అధికారులు గుర్తించి... అందుకనుగుణంగా ప్రాజెక్టులను ప్రతిపాదించనున్నారు. కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానంలో యూనిట్‌ ధరను నిర్ణయించి డిస్కంలు పీపీఏలు చేసుకుంటాయి.

మౌలిక సదుపాయాల గుర్తింపు

వ్యవసాయ వినియోగానికి పోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయటానికి అవకాశమున్న ఉపకేంద్రాల సమాచారాన్ని అధికారులు తీసుకుంటున్నారు. సుమారు 3వేల ఉప కేంద్రాలను వినియోగించుకునే అవకాశం ఉంటుందని ప్రాథమిక అంచనా. ఈ పథకం కింద వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో మీటర్ల ఏర్పాటును విద్యుత్‌ సంస్థలు పూర్తి చేశాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. కొన్ని ప్రాజెక్టులను కోస్తా జిల్లాల్లో ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు. రాయలసీమలో ఇప్పటికే భారీ సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది అధికారుల ఆలోచన.

* వ్యవసాయానికి అందించే విద్యుత్‌ను లెక్కించటానికి ఫీడర్‌ దగ్గర మీటర్‌ను ఏర్పాటు చేస్తారు. దీని ఆధారంగా వ్యవసాయ విద్యుత్‌ వినియోగాన్ని లెక్కించి అందుకు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వం నుంచి డిస్కంలు వసూలు చేసుకుంటాయి. గ్రిడ్‌కు వెళ్లిన విద్యుత్‌ను ఉపకేంద్రాల దగ్గర ఏర్పాటు చేసిన మీటర్‌ ద్వారా నమోదు చేస్తారు. వీటిని త్వరగా పూర్తి చేస్తే మళ్లీ కొత్త ప్రాజెక్టులు వస్తాయని ఓ అధికారి తెలిపారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.