ETV Bharat / city

సినీఫక్కీలో ఎంపీటీసీపై హత్యాయత్నం - murder attempt on mptc ramu news

ఓ ఎంపీటీసీపై సినీ ఫక్కీలో హత్యాయత్నం జరిగింది. అర్ధరాత్రి వేళ బైక్​పై వెళ్తున్న ఎంపీటీసీని కొందరు కారులో వెంబడించగా.. వారి నుంచి తప్పించుకునేందుకు మరో మార్గంలో వెళ్లేందుకు యత్నించాడు. ఈ ఎత్తును ముందే ఊహించిన దుండగులు.. అక్కడ మరో ముఠాను సిద్ధంగా ఉంచారు. అదృష్టం కొద్ది అక్కడి నుంచీ ఎంపీటీసీ తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. తర్వాత ఏమైందంటే..?

attempt to murder
సినీఫక్కీలో ఎంపీటీసీపై దాడి
author img

By

Published : Mar 4, 2021, 12:40 PM IST

సినీఫక్కీలో ఎంపీటీసీపై దాడి

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఇందిరానగర్ ఎంపీటీసీ మండల రాముపై హత్యాయత్నం జరిగింది. బుధవారం అర్ధరాత్రి జేకే కాలనీ నుంచి మోటార్ బైక్​పై ఇంటికి వెళ్తున్న రామును కారులో కొందరు దుండగులు వెంబడించారు. గమనించిన రాము మరో మార్గంలో వెళ్తుండగా.. అక్కడే మాటు వేసిన మరికొందరు అతడిపై దాడికి యత్నించారు. అప్రమత్తమైన బాధితుడు చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకోవటంతో ప్రాణాపాయం తప్పింది.

ఈ విషయంపై ఎంపీటీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరి వల్ల తనకు ప్రాణభయం ఉందని.. తనను అంతమొందించాలని చూస్తున్న వారిని అరెస్టు చేయాలని కోరాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దాడి కోసం ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ ఎంపీటీసీ రాముపై కొందరు హత్యాయత్నం చేశారు. జైలుకు సైతం వెళ్లి వచ్చారు.

ఇదీ చదవండి:

దుర్గమ్మ చెంతన... అయినవారిదే రాజ్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.