Strike: సమాన పనికి సమాన వేతనం కల్పించాలంటూ.. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు రెండోరోజూ ఆందోళనకు దిగారు. నిరవధిక సమ్మెలో భాగంగా.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో.. మున్సిపల్ కార్మికులు కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. హైపవర్ కమిటీ పేరుతో.. ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను మోసం చేస్తోందంటూ.. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.
ఐకాస రాష్ట్రవ్యాప్త సమ్మె పిలుపుతో.. నిడదవోలులో ఆందోళన నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. కోనసీమ జిల్లా అమలాపురంలో మున్సిపల్ కార్మికులు విధులకు రాకపోవడంతో.. అధికారులు ప్రైవేటువారితో పనులు చేయిస్తున్నారు. వారిని అడ్డుకున్న మున్సిపల్ కార్మికులపై..అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరపాలకసంస్థ కార్యాలయం ఎదుట.. అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. తమను కరోనా వారియర్స్‌గా పిలిచారే తప్ప జీతాలు పెంచలేదంటూ.. విజయనగరం జిల్లాలో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ ముఖ్యమంత్రి పీఠమెక్కి మూడున్నరేళ్లవుతున్నా హామీలు నెరవేర్చలేదంటూ.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలాచోట్ల మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించారు. సమస్యల పరిష్కారంలో.. ప్రభుత్వానికి చిత్తుశుద్ధి లేదంటూ.. కడప జిల్లా సీపీఐ నేతలు ఆరోపించారు. ప్రభుత్వం హామీలు అమలు చేసేవరకూ సమ్మె చేస్తామని.. నెల్లూరులో కార్మికులు ప్రకటించారు.
ఇదీ చదవండి: