ETV Bharat / city

అనిశా అభియోగాల్లో ఎలాంటి నిజం లేదు: ఎంపీ రేవంత్​ రెడ్డి

ఓటుకు నోటు కేసు విచారణను అనిశా న్యాయస్థానం చేపట్టడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణకు చెందిన ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అవినీతి నిరోధక చట్టం వర్తించనప్పుడు ఈకేసు అనిశా న్యాయస్థానం పరిధిలోకి రాదని అందులో పేర్కొన్నారు.

vote for note case
తెలంగాణ ఎంపీ రేవంత్​ రెడ్డి
author img

By

Published : Dec 22, 2020, 10:45 PM IST

ఓటుకు నోటు కేసు విచారణను అనిశా న్యాయస్థానం చేపట్టడాన్ని సవాల్.. చేస్తూ ప్రధాన నిందితుడిగా ఉన్న తెలంగాణ ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అనిశా అభియోగాల్లో ఎలాంటి నిజం లేదని అందులో తెలిపారు. ఒకవేళ వాటిని పరిగణలోకి తీసుకున్నా... అవి అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రావని పేర్కొన్నారు.

ప్రజా సేవకుడిగా తను అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు అవినీతి నిరోధక శాఖ ఎక్కడా పేర్కొనలేదు కాబట్టి అనిశా చట్టం వర్తించదన్నారు. ఆ పక్షంలో ఈ కేసు అనిశా న్యాయస్థానం పరిధిలోకి రాదని పిటిషన్​లో పేర్కొన్నారు. అనిశా కోర్టు దీనిపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. రేవంత్ రెడ్డితో పాటు సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా, సెబాస్టియన్​లు న్యాయస్థానానికి ఈరోజు హాజరయ్యారు.

ఇదీ చదవండి:

పొలం కబ్జాకు వైకాపా నేతల యత్నం...కత్తితో పొడుచుకున్న కౌలు రైతు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.