ఓటుకు నోటు కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్, ఆయన స్నేహితుడు మాల్కం టేలర్ వాంగ్మూలం నమోదు పూర్తయింది. అనిశా ప్రత్యేక న్యాయస్థానంలో ఇవాళ్టి విచారణకు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా హాజరయ్యారు. ఏసీబీకి ఫిర్యాదు చేసిన స్టీఫెన్ సన్తో పాటు.. రెండో సాక్షిగా ఉన్న ఆయన స్నేహితుడు మాల్కం టేలర్ వాంగ్మూలాన్ని న్యాయస్థానం నమోదు చేసింది.
అనిశా సమర్పించిన వీడియోలు, ఆడియోలను ప్రదర్శించారు. వాటిలో రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహాను స్టీఫెన్ సన్ గుర్తించారు. వారే తనకు లంచం ఇవ్వచూపారని కోర్టుకు తెలిపారు. మూడో సాక్షిగా ఉన్న స్టీఫెన్ సన్ కుమార్తె వాంగ్మూలం నమోదు కోసం విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది. ఆ తర్వాత ముగ్గురినీ రేవంత్ రెడ్డి, ఇతర నిందితుల తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.
ఇవీ చదవండి: