రాష్ట్ర రాజధాని పోరాటంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న అనిశ్చిత పరిస్థితిని చూసి.... తెలంగాణ వాడిగా సంతోషిస్తున్నానన్నారు. అలాగే భారతీయుడిగా బాధపడుతున్నాని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కుప్పకూలే పరిస్థితి ఉందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చెప్పారు. నిన్నటి వరకు సోదరులుగా ఉన్న రాష్ట్రంలో ముసలం పుట్టడం బాధగా ఉందని అన్నారు. ఏపీ పరిణామాల వల్ల హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారం పుంజుకుందని వెల్లడించారు. తెలంగాణలో ఉన్న స్థిరాస్తి వ్యాపారి కోసమే... రాష్ట్రంలో ఆందోళన సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: