రాజధాని అంశంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాను కలిశానని ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పష్టం చేశారు. పరిపాలన ఎక్కడనుంచి జరిగితే దాన్నే రాజధాని అంటారని వ్యాఖ్యానించారు.
"హైకోర్టు ఉంటే న్యాయ రాజధాని, అసెంబ్లీ ఉంటే శాసన రాజధాని కాదు. ఇదే విషయాన్ని హోం కార్యదర్శి కూడా చెప్పారు. రైతుల త్యాగాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరా. కేంద్రం వేసిన అఫిడవిట్‌లో అవేవీ పరిగణనలోకి తీసుకోలేదని చెప్పా. అటార్నీ జనరల్ లేదా సొలిసిటరీ జనరల్ సలహాతో అఫిడవిట్లు వేయాలన్నా.. అన్ని అంశాలు పరిశీలిస్తామని అజయ్ భల్లా చెప్పారు" అని రఘురామకృష్ణరాజు వెల్లడించారు.
ఇదీచదవండి