'శస్త్ర చికిత్స చేయించుకున్న మా బాబాయిని 20 గంటల పాటు ఆహారమూ మందుల్లేకుండా వాహనాల్లో తిప్పటంతో ఆయనకు రక్తస్రావవుతోంది' అని తెదేపా నేత, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించకుండా అత్యవసరంగా ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ట్వీట్ చేశారు. మా బాబాయికీ ఏం జరిగినా ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని పేర్కొన్నారు. రోడ్డు మార్గంలో అచ్చెన్నాయుడిని విజయవాడకు తరలిస్తున్న సమయంలో తీవ్ర రక్తస్రావమైందని ఆయన సోదరుడి కుమారుడు కింజరాపు సురేశ్ కుమార్ చెప్పారు.
చికిత్స అందించండి: సీఎం ఆదేశం
అచ్చెన్నాయుడికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలుసుకున్న సీఎం జగన్ ఆయనకు తగిన చికిత్స అందించాలని ఏసీబీ అధికారులను ఆదేశించారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేటప్పుడు కూడా ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో గుంటూరు జీజీహెచ్ లో అచ్చెన్నకు చికిత్స ఇప్పించేందుకు ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: