ETV Bharat / city

సీఎం జగన్​తో సినీ ప్రముఖుల భేటీ.. వివరాలు ఇవే - celebrities meeting with CM

Tollywood Celebrities Meet CM Jagan: సీఎం జగన్‌తో తెలుగు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారంపై చర్చించేందుకు చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

సీఎం జగన్​తో ముగిసిన సినీ ప్రముఖుల భేటీ
సీఎం జగన్​తో ముగిసిన సినీ ప్రముఖుల భేటీ
author img

By

Published : Feb 10, 2022, 3:15 PM IST

Tollywood Celebrities Meet CM Jagan: సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారంపై జరిగిన ఈ చర్చలో.. పరిశ్రమ తరపున చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, అలీ తదితరులు పాల్గొన్నారు.

సీఎం జగన్​తో చర్చలో పాల్గొన్న సినిమా హీరోలు, దర్శకులు వీళ్లే..
Tollywood Celebrities Meet AP CM Jagan: రాష్ట్రంలో టికెట్​ రేట్లపై ఏపీ సీఎం జగన్​తో టాలీవుడ్​ ప్రముఖుల భేటీ ముగిసింది. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, నారాయణమూర్తి ఈ భేటీలో పాల్గొన్నారు. మొదటగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వీరు.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడ సీఎం జగన్‌తో సమావేశమయ్యారు.

జగన్​ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి పేర్ని నానితోపాటు ఉన్నతాధికారులూ పాల్గొన్నారు. నిర్మాతలు నష్టపోకుండా టికెట్ల ధరలు పెంచాలని పరిశ్రమ ప్రముఖులు కోరారు. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ కూడా.. టికెట్ ధరలు పెంచాలని ప్రాథమికంగా సిఫార్సు చేసినట్లు తెలిసింది. పరిశ్రమ ప్రతిపాదనలు, కమిటీ సిఫార్సులపై సినీ ప్రముఖులతో సీఎం జగన్​ చర్చించారు. ఎంతమేర టికెట్లు పెంచాలనే దానిపై అభిప్రాయాలు తీసుకున్నారని తెలిసింది.

వివిధ అంశాలపై...
చిత్ర పరిశ్రమకు ప్రభుత్వ సహకారంతోపాటు సినీ కార్మికులకు సాయంపైనా.. ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు చర్చించారని సమాచారం. కొవిడ్‌ తొలిదశలో లాక్​డౌన్ కారణంగా 3నెలలపాటు థియేటర్లు మూతపడ్డాయి. ఆ తర్వాత తెరచుకున్నా.. 50 శాతం సీటింగ్ సహా వివిధ రకాల ఆంక్షలతో రాబడి అంతంతమాత్రమేనని యజమానులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో థియేటర్ల యజమానులకు కరెంట్ బిల్లుల రాయితీ సహా సినీ కార్మికులకు అందించాల్సిన సాయంపైనా చర్చించారని తెలిసింది. ఈ భేటీ నేపథ్యంలో.. సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు అవార్డులు ఇవ్వడం, ఇతరత్రా తీసుకోవాల్సిన చర్యలపైనా సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కమిటీ నివేదికలో ఏముంది?
సినిమా టికెట్ ధరలు తక్కువగా ఉండటంతో నష్టపోతున్నామని పలువురు సినిమా నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ధరల విషయంపై కమిటీ అధ్యయనం పూర్తి చేసి నివేదికను సిద్ధం చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో టికెట్‌ ధరలను ఏ మేరకు పెంచాలన్న దానిపైనా.. ఇటు ప్రజలకు, అటు సినీ పరిశ్రమకు ఇబ్బంది లేకుండా టికెట్‌ రేట్లు ఎంత ఉండాలన్న దానిపైనా కమిటీ సభ్యులు నివేదికను రూపొందించారు. ఈ నివేదికలోని అంశాలను మంత్రి పేర్ని నాని, సీఎం జగన్‌కు వివరించారు. థియేటర్లలో మౌలిక సదుపాయాలు, క్యాంటీన్‌లో ఆహార పదార్ధాల ధరలపైనా కమిటీ చేసిన అధ్యయనాన్ని మంత్రి పేర్ని నాని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరి, అంతిమంగా సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇదీ చదవండి:

CM Jagan Serious: విశాఖలో ట్రాఫిక్‌ ఆంక్షలు... సీఎం జగన్ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.