తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పులుమద్ది గ్రామానికి చెందిన బేగరి రాంచందర్, లక్ష్మమ్మకు నలుగురు కుమారులు. చివరివాడైన శివప్రసాద్(17) తల్లితో తరచూ గొడవపడుతూ ఉండేవాడు. పెళ్లి చేయమని వేధించేవాడు. డబ్బులు ఇవ్వమని రోజూ తాగి గొడవ పడేవాడు. విసిగిపోయిన ఆమె అడ్డు తొలగించుకోవాలని భావించింది. కొడుకును చంపించేందుకు ప్రణాళిక రచించింది.
సుపారీ ఇచ్చి
తన బంధువులైన బిలాల్‌పూర్‌కు చెందిన అనంతరాములుతో లక్ష రూపాయలకు సుపారీ కుదుర్చుకుంది. రూ.20వేలు అడ్వాన్స్ ఇచ్చింది. రంగంలోకి దిగిన అనంతరాములు... బిలాల్‌పూర్‌కు చెందిన మరో ఇద్దరితో కలిసి స్కేచ్ వేశాడు. మందు తాగుదామని శివప్రసాద్‌ను పీచరేగడి తాండకు రమ్మన్నాడు. మందు తాగించి... తువ్వాలతో ఉరివేసి చంపేసి... బావిలో పడేశాడు.
కటకటాల పాలు...
తన కొడుకు కనిపించడం లేదని... మృతుని తండ్రి రాంచందర్ గత నెల 7న వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసు ఛేదించారు. లక్ష రూపాయలు సుపారీ ఇచ్చి కన్నతల్లే హత్య చేయించిందని వికారాబాద్ సీఐ రాజశేఖర్ వెల్లడించారు. మృతుడి తల్లి లక్ష్మమ్మ, అనంతరాములుతో పాటు అతడి సహకరించిన వారందరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి : తెగ తాగేశారు: 2020లో మద్యం అమ్మకాల ఆల్‌టైమ్ రికార్డు