తెలంగాణలోని ఖమ్మం నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకొంది. మున్నేరు నదిలో దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకొంది. గమనించిన స్థానికులు ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. నది నుంచి బయటకు తీసుకువచ్చారు. కానీ అప్పటికే వారు మరణించారు. బలవన్మరణానికి ఆర్థిక సమస్యలే కారణమని తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చారు. మృతుల వివరాలు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్నం సేవా సంస్థ సభ్యులు మృతదేహాలను మార్చురీకి తరలించారు.
ఇవీచూడండి:
YSR Beema: సాధారణ మరణానికి రూ.లక్ష.. ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షలు సాయం!