తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామంలో బతుకమ్మ పండుగపూట విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లీకూతురు మృతిచెందారు. బట్టలు ఉతకడానికి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి రోజా(28) అనే మహిళ చెరువుకు వెళ్లింది. ప్రమాదవశాత్తు చిన్న కూతురు చైత్ర(5) చెరువులో జారి పడగా.. ఆ పాపను కాపాడబోయి తల్లి కూడా చెరువులో పడిపోయింది. ఈత రాకపోవడంతో ఇద్దరు చెరువులో మునిగి చనిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించి మృతదేహాలను వెలికితీశారు.
వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన చెప్యాల రోజా పండుగ నిమిత్తం పుట్టిళ్లు ఎనగుర్తికి వచ్చింది. ఈ క్రమంలో గురువారం బట్టలు ఉతకడానికి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి చెరువు వద్దకు వచ్చింది. గట్టుపై ఇద్దరు కూతుళ్లు ఆడుకుంటుండగా.. చిన్న కూతురు చైత్ర కాలుజారి చెరువులో పడిపోయింది. పాపను రక్షించబోయి తల్లి కూడా ప్రాణాల కోల్పోయింది. మృతురాలు రోజా భర్త కూడా ఏడాదిన్నర క్రితం చనిపోగా.. ఆమె కూతుళ్లతో కలిసి జీవనం సాగిస్తోంది. తల్లి, చెల్లి మరణంతో చిన్నారి రష్మిక చూపులు పలువురిని కంటతడి పెట్టించాయి.
ఇదీ చదవండి: ACCIDENT: వెంకటగిరి శివారులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి