ETV Bharat / city

మహిళా కండక్టర్ల కోసం సంచార శౌచాలయాలు.. - మహిళా కండక్టర్లకు శౌచాలయాలు వార్తలు

రాష్ట్రంలోని ఆర్టీసీ ఛేంజ్‌ ఓవర్‌ పాయింట్ల వద్ద వసతులు లేక మహిళా కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లోని శౌచాలయాలను వినియోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు వినూత్నంగా ఆలోచించారు. పాత బస్సులను శౌచాలయాలుగా మార్చి... అందుబాటులోకి తీసుకువచ్చారు. మహిళా కండక్టర్లకు భరోసా కల్పించారు.

mobile toilets
మహిళా కండక్టర్లకు శౌచాలయాలు
author img

By

Published : Apr 18, 2021, 12:34 PM IST

మహిళా కండక్టర్లకు శౌచాలయాలు

ఆర్టీసీలో మధ్యాహ్నం సమయానికి వచ్చే డ్రైవర్లు, కండక్టర్లు... నేరుగా ఛేంజ్‌ ఓవర్‌ పాయింట్ల వద్ద విధి నిర్వహణలో చేరతారు. సాధారణ దుస్తుల్లో చేరుకొని తర్వాత ఆర్టీసీ కేటాయించిన దుస్తులు ధరిస్తారు. అయితే.... ఛేంజ్ ఓవర్ పాయింట్ల వద్ద శౌచాలయాలు లేకపోవటంతో మహిళా కండక్టర్లు తీవ్ర అవస్థలు పడేవారు. అత్యవసర పరిస్థితుల్లో సమీపంలోని ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లోని శౌచాలయాలు వినియోగించుకునేవారు. కరోనా పరిస్థితుల్లో వాటిని వినియోగించుకోవటానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇది గమనించిన యాజమాన్యం మహిళా కండక్టర్ల సౌకర్యార్థం సంచార శౌచాలయాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని వివిధ ఛేంజ్ ఓవర్ పాయింట్ల వద్ద అందుబాటులోకి తీసుకువచ్చింది.

మహానగరంలోని సుచిత్ర, కూకట్‌పల్లి, కొండాపూర్, చిలకలగూడ, బాలానగర్, లింగంపల్లి, ఎల్బీనగర్ వంటి 14 ప్రధాన పాయింట్లలో... సంచార బయో టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ఇందులో దుస్తులు మార్చుకునేందుకు, విశ్రాంతి తీసుకోవటానికి, భోజనం చేసేందుకు కూడా సౌకర్యాలు కల్పించారు. ఛేంజ్‌ ఓవర్‌ పాయింట్ల వద్ద వసతుల్లేక గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్న మహిళ కండక్టర్లు.... సంచార శౌచాలయాల వల్ల తమకు ఉపశమనం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.

మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కావడం వల్ల.... శౌచాలయ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో టీకాల కొరత... నేడు వ్యాక్సినేషన్​ నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.