ETV Bharat / city

తెలంగాణ: ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన సురభి వాణీదేవి

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన వాణీదేవిని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. ఫలితం వెలువడిన తర్వాత వాణీదేవి ప్రగతి భవన్​కు వెళ్లి కేసీఆర్ ను కలిశారు. పార్టీ కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఎన్నికల్లో బాగా పనిచేశారని కేసీఆర్‌ అభినందించారు.

v
ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన సురభి వాణీదేవి
author img

By

Published : Mar 21, 2021, 12:30 AM IST

హైదరాబాద్-–రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన సురభి వాణీ దేవి.. సీఎం కేసీఆర్​ను ప్రగతిభవన్​లో కలిశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశమిచ్చి, అన్నీతానై తన గెలుపునకు కారణమైన సీఎంకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వాణిదేవికి అభినందనలు తెలిపిన సీఎం.. శాలువాతో ఆమెను సత్కరించారు. విజయాన్ని కట్టబెట్టిన అన్ని వర్గాల ప్రజలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. పార్టీ గెలుపు కోసం పని చేసిన మంత్రులు, నేతలు, కార్యకర్తలకు సీఎం అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, సంతోశ్​ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వి.శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఉక్కు పరిశ్రమ ఉద్యోగి అదృశ్యం కేసులో... కొత్త కోణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.