MLC Patnam Mahender Reddy Audio Viral: ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఫోన్లో పరుష పదజాలం ఉపయోగిస్తూ సీఐని బెదిరించారు. మూడు రోజుల కిందట తాండూరు పట్టణంలోని భద్రేశ్వర ఆలయం జాతరలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌తో వచ్చిన రౌడీషీటర్లకు పోలీసులు సహకరించారని ఆ ఆడియోలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆరోపించారు. కార్పెట్ ఎందుకు వేశారంటూ సీఐని దుర్భాషలాడుతూ నిలదీశారు. స్పందించిన సీఐ కార్పెట్ వేయడం, తీయడం మా పని కాదని సమాధానం ఇవ్వడంతో మరింత ఘాటుగా స్పందించిన మహేందర్ రెడ్డి... నీ అంతూ చూస్తానంటూ బెదిరించారు.
"పొరపాటున నోరుజారి మనసు నొప్పించినందుకు విచారిస్తున్నా. పోలీసులు నా కుటుంబ సభ్యులతో సమానం. పోలీసుల మనస్సు నొప్పిస్తే నాకు బాధగా ఉంటుంది. రాష్ట్రఆవిర్భావం, అభివృద్ధిలో పోలీసుల కృషి అభినందనీయం. పోలీసులంటే ఎనలేని గౌరవం ఉంది." - ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి
ఇదీ చూడండి: వరుస అఘాయిత్యాలు జరుగుతున్నా.. సీబీఐ దత్తపుత్రుడిలో చలనం లేదు: నాదెండ్ల