నిమ్మగడ్డ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చావుదెబ్బ అని.. ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఇప్పటివరకూ హైకోర్టుతోనే మొట్టికాయలు తిన్నారని.. ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టిందన్నారు. నిమ్మగడ్డ కేసులో ధర్మాసనం స్టే ఇవ్వకపోగా... రాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని వ్యాఖ్యలు చేసిందన్నారు. సామాన్యుడికీ అర్థమయ్యేలా ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టిందని స్పష్టంచేశారు. దీన్నిబట్టే ప్రభుత్వ దిగజారుడుతనం ఏ విధంగా ఉందో తెలుస్తోందని విమర్శించారు.
జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు పంచాయితీరాజ్ శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని హితవు పలికారు. ఆ శాఖ ఇంజినీర్లు ధైర్యంగా రోడ్డు మీదకు వచ్చి సమ్మె చేసిన విషయం వారికి తెలుసా అని ప్రశ్నించారు. రాజకీయ హింస తట్టుకోలేకే వారు రోడ్డెక్కారని తెలిపారు.
ఇవీ చదవండి...