అమరావతిలోని దళిత రైతుల భూములను లాక్కోవడంలో ప్రమేయమున్న ప్రతి ఒక్కరిన్నీ అరెస్ట్ చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (mla alla ramakrishna reddy ) డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో దళితులు ఉండకూడదని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు (Chancdrababu) భావించారని ఆరోపించారు. అందుకే పక్కా పథకం ప్రకారం వారి భూములను లాక్కున్నారని వ్యాఖ్యానించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులను రంగంలోకి దింపి ఈ వ్యవహారానికి తెరలేపారని అన్నారు. మంగళిగిరి, తాడేపల్లిలోని అసైన్డ్ భూముల (assigned lands)ను గుర్తించి.. రైతులను బెదిరించారని చెప్పారు. రాజధాని భూమలు విషయంలో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి అధికారులు ఉన్నారని.. వీరిలో ఏ ఒక్కర్నీ వదలిపెట్టవదని పోలీసులను కోరారు. తన వద్ద ఉన్న ఆధారాలను సీఐడీ పోలీసులకు అప్పగిస్తానని చెప్పారు.
ఇదీ చదవండి: