కరోనా కష్టాల్లో ఉన్నప్పుడు మిరప అమ్ముకోవడానికే రైతులు ఇబ్బందులు పడ్డారు. కూలీల సమస్యతో కొన్నిచోట్ల పండిన పంటను కోయలేకపోయారు. మార్కెట్ మూసివేయడంతో.. కొందరు తక్కువకే అమ్మేశారు. క్వింటాలుకు దక్కిన ధర సగటున రూ.10వేల నుంచి రూ.13వేలు మాత్రమే. చివరి కోత సమయంలో ధరలు పడిపోవడంతో మరికొందరు శీతల గోదాములకు తరలించారు. తెలుగు రాష్ట్రాల్లోని శీతల గోదాముల్లో సుమారు 55 లక్షల బస్తాల మిరప నిల్వలు ఉంటాయని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త పంట వచ్చే నాటికి ఈ నిల్వలను ఖాళీ చేస్తారు. అంటే డిసెంబరు నెలాఖరుకు ప్రస్తుతం ఉన్న నిల్వల్లో అధికశాతం విక్రయాలు పూర్తి కావాలి.
భారత్, చైనాలో సరిహద్దుల ప్రభావం వ్యాపారంపై ఎంతమాత్రం లేదని వ్యాపారుల అభిప్రాయంగా ఉంది. కొందరు కావాలనే ధరలు పెంచి.. మళ్లీ తగ్గిస్తున్నారనే విమర్శలు మార్కెట్ వర్గాల నుంచే వ్యక్తమవుతుండటం గమనార్హం. గత 15 రోజుల్లో ఎగుమతి ఆర్డర్లు భారీగా పెరిగింది లేదు, ఇప్పుడు తగ్గిందీ లేదు అని ఎగుమతి వ్యాపారి ఒకరు వివరించారు.
ఇదీ చదవండి: ముప్పు తలెత్తితే అణ్వస్త్రాల మోహరింపు:కిమ్