Earthquake: ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో శనివారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం సుమారు రెండు, మూడు సెకన్ల పాటు శబ్దాలు రావటంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
- ప్రకాశం జిల్లాలోని పొదిలి పట్టణం, మాదాలవారిపాలెం, కనిగిరి పట్టణం, హనుమంతునిపాడు, మర్రిపూడి మండలం దుక్కిరెడ్డిపాలెం, గొండ్ల సముద్రంలో భూమి కంపించింది.
- బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పరిటాలవారిపాలెం, బల్లికురవ మండలం కూకట్లపల్లిలో స్వల్ప భూ ప్రకంపనలు.
- పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం పిచ్చుకలపాలెం తదితర గ్రామాల్లో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. కొన్ని చోట్ల ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి.
రిక్టర్‌స్కేల్‌పై దాని ప్రభావం ఏ మేరకు నమోదైంది అనే అంశాలు ఆదివారం ప్రకటిస్తామని హైదరాబాద్ భూగర్భ పరిశోధనా సంస్థ అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి: