ETV Bharat / city

బీసీలకు రాజకీయ ప్రాధాన్యత దక్కింది: మంత్రులు - ఏపీ బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్ల జాబితా వార్తలు

56 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు ఛైర్మన్లను ప్రకటించడంపై మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రులు ధర్మాన కృష్ణదాస్, వేణుగోపాల్, బొత్స సత్యనారాయణ, శంకరనారాయణ, అనిల్ అన్నారు. అణగారిన వర్గాల వారిని రాజకీయంగా పైకి తీసుకుచ్చేందుకు సీఎం జగన్ అన్నివిధాలా కృషిచేస్తున్నారని చెప్పారు.

ministers
ministers
author img

By

Published : Oct 18, 2020, 3:50 PM IST

బీసీ కార్పొరేషన్లకు ఛైర్మన్ లను బీసీ సంక్షేమ శాఖా మంత్రి వేణుగోపాల్ ప్రకటించారు. బీసీల్లో మొత్తం 139 వెనుకబడిన కులాలున్నాయని.. వీటికి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఛైర్మన్ లను ప్రకటించినట్లు మంత్రి తెలిపారు. ఒక్కొక్క కార్పొరేషన్ కు ఛైర్మన్, డైరక్టర్ ఉంటారన్నారు. మొత్తం 728 మంది నేతలకు అవకాశం వచ్చిందని చెప్పారు.

వెనుకబడిన కులాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రానికి బీసీలు వెన్నుముకలాంటి వారని అన్నారు. సీఎం జగన్ పాదయాత్రలో బీసీల బాధలను తెలుసుకుని వారికి రాజకీయ ప్రాధాన్యతనిచ్చారన్నారు. నాడు పాదయాత్ర సందర్భంగా బీసీ వర్గాలకు జగన్ మాట ఇచ్చారని... ఆ మేరకు ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్నారని ఎంపీ మోపిదేవి తెలిపారు.

ఇదీ చదవండి:

బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.