బుల్లెట్టు బండి.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే పాట మారుమోగుతోంది. ఏ వేడుకలోనైనా ఈ పాట ఉండాల్సిందే.. చిన్నా పెద్దా అందరూ.. చిందులేయాల్సిందే. హుషారెత్తించే ఈ పాటకు తాజాగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సతీమణి.. డాన్స్ వేశారు. మంత్రి నారాయణ స్వామి 42వ వివాహ వార్షికోత్సవాన్ని తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సతీమణి బుల్లెట్టు బండి పాటకు నృత్యం చేస్తూ ఆకట్టుకున్నారు. మంత్రి సతీమణి డ్యాన్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: దేశంలో మళ్లీ పెరిగిన కేసులు- కొత్తగా 30వేల మందికి వైరస్