ETV Bharat / city

సెక్షన్‌ 90 పేరుతో దొడ్డిదారిన సంతకం: మంత్రి వెల్లంపల్లి

శాసనమండలిలో సెక్షన్‌ 90 పేరుతో నిబంధనలను ఉల్లంఘించే రీతిలో ప్రతిపక్షం వ్యవహరించిందని వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నేతృత్వంలో తెదేపా నేతలు విచక్షణ మరచి ప్రవర్తించారన్నారు. మండలి డిప్యూటీ ఛైర్మన్‌ సైతం స్థాయికి తగని విధంగా వ్యవహరించారని ఆరోపించారు.

Minister vellampalli SrinivasaRao fire on yenamala ramakrishnudu for budget in ap Assembly
సెక్షన్‌ 90 పేరుతో దొడ్డిదారిన సంతకం: మంత్రి వెల్లంపల్లి
author img

By

Published : Jun 18, 2020, 2:53 PM IST

మండలిలో బిల్లులు అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వ్యవహరించారని వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. బిల్లులు పెండింగ్‌లో పెట్టి సెక్షన్ 90 అడ్మిట్ అయినట్లు యనమల సంతకం పెట్టించారని మండిపడ్డారు. ప్రభుత్వ బిల్లులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లపై ఉందని.... మనీ బిల్లు ఆమోదించాకే సభను వాయిదా వేయాల్సి ఉంటుందని అన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌ వ్యవహరించారు. రాజ్యాంగ బద్ధ పదవిలో ఉండి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాన్ని ఖండిస్తున్నాం. సభలోని దృశ్యాలు లోకేష్ రికార్డు చేసి బయటకు పంపుతున్నారు. ప్రజలకు మంచి జరగకూడదనే తెదేపా బిల్లును అడ్డుకుంది. ప్రజాకోర్టులో చంద్రబాబు దోషిగా నిల్చున్నారు... నాపై, అనిల్, కన్నబాబుపై దాడులు చేసేందుకు తెదేపా సభ్యులు ముందుకు వచ్చారు.

- వెల్లంపల్లి శ్రీనివాసరావు, దేవాదాయశాఖమంత్రి

-

ఇదీ చదవండి:

'బిల్డ్ ఏపీ'పై హై కోర్టులో 10 పిటిషన్లు.. సోమవారానికి విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.