ETV Bharat / city

నవంబరులో 'ఈబీసీ నేస్తం' అమలు: మంత్రి పేర్ని నాని - ఏప్రిల్​లో వసతి దీవెన, విద్యా దీవెన

2021-22లో అమలు చేసే పథకాల క్యాలెండర్​కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏప్రిల్​లో వసతి దీవెన, విద్యా దీవెన పథకాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. నవంబరులో కొత్తగా ఆమోదించిన ఈబీసీ నేస్తం అమలు చేస్తామన్నారు.

మంత్రి పేర్ని నాని
minister perni nani
author img

By

Published : Feb 24, 2021, 6:01 PM IST

ఏప్రిల్​లో వసతి దీవెన, విద్యా దీవెన పథకాలను అమలు చేయనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. 2021-22లో అమలు చేసే పథకాల క్యాలెండర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఏప్రిల్‌లో రైతులకు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ అమలు చేయనున్నట్లు వివరించారు. మే నెలలో మత్స్యకార భరోసా అమలు చేస్తామన్న ఆయన... జూన్‌లో వైఎస్‌ఆర్‌ చేయూత, జగనన్న విద్యాకానుక అమలవుతాయన్నారు.

'జులైలో వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకం అమలు చేస్తాం. ఆగస్టులో నేతన్న నేస్తం, అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం ఇస్తాం. సెప్టెంబరులో వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం, అక్టోబరులో రైతు భరోసా 2వ విడత, చేదోడు, తోడు పథకాలు, నవంబరులో కొత్తగా ఆమోదించిన ఈబీసీ నేస్తం, డిసెంబరులో 2, 3వ విడత విద్యాదీవెన, వసతిదీవెన, లా నేస్తం అమలు చేస్తాం'- పేర్ని నాని, రాష్ట్ర మంత్రి

జనవరి 22లోగా 3వ విడత రైతుభరోసా అమలు చేస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు. జనవరి 22లోగా అమ్మఒడి, పింఛను 2,500కు పెంపు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వంలో అక్రమాలు ఏ మాత్రం సహించబోమని స్పష్టం చేశారు. దుర్గగుడిలో అనిశా సోదాలు చేస్తే వెల్లంపల్లిపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు.

ఇదీ చదవండి

మనబడి నాడు-నేడులో సీఎం జగన్​ కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.