కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ వాయిదా వేస్తున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. అంగన్వాడీలు ఇళ్ల వద్దకే వచ్చి పౌష్టికాహారం అందిస్తారని తెలిపారు. మరోవైపు కరోనా నియంత్రణకు విస్తృత ప్రచారం చేస్తామని చెప్పారు. ప్రజలంతా ఒకేచోటకు రాకుండా పలుచోట్ల రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గుంటూరు మిర్చి యార్డులో కార్యకలాపాలు నిలిపివేశామని తెలిపారు.
కఠిన చర్యలు తప్పవు..
నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. ఆకతాయిలపై 338 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. అత్యవసర సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని చెప్పారు. మార్చి 29న రేషన్ సరకులు అందిస్తామన్న మంత్రి...తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి రూ. వెయ్యి అందిస్తామని తెలిపారు.
'కరోనా అనుమానిత లక్షణాలుంటే 104కు ఫోన్ చేయాలి. కరోనా నివారణ చర్యలపై ఐఏఎస్ అధికారుల కమిటీ పని చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వాటిని నమ్మవద్దు. అలాంటి పోస్టులు చేసే వారిపై తప్పుడు పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటాం ' - పేర్ని నాని, మంత్రి
ఇదీ చదవండి :