అమరావతిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రైతులు దూషించినా, కొట్టినా, తిట్టినా పట్టించుకోబోమన్నారు. అమరావతి నుంచి బ్యారేజ్, లింక్ రోడ్లు, బాహ్యవలయ రహదారి నిర్మిస్తామని వివరించారు. తమ భూముల విలువ పెరగాలని అమరావతి రైతుల ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. అమరావతి భూముల విలువ పెంచేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఎన్‌వోసీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ముగిసిన మంత్రివర్గ సమావేశం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చ