ETV Bharat / city

గ్రామాల్లో కొత్త లే అవుట్లకు అనుమతులు ఇవ్వొద్దు: మంత్రి పెద్దిరెడ్డి - మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజా వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త లే అవుట్లకు అనుమతులు ఇవ్వొద్దని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. డిసెంబరు 2 తేదీ నుంచి 21 తేదీ వరకూ చేపట్టే శానిటైజేషన్ కార్యక్రమంపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు.

GOVT ON ILLEAGAL
GOVT ON ILLEAGAL
author img

By

Published : Nov 19, 2020, 6:14 PM IST

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త లే అవుట్లకు అనుమతులు ఇవ్వొద్దని పంచాయితీరాజ్​ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. జిల్లా పంచాయితీ అధికారులు, జెడ్పీ సీఈఓలతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన.. మేజర్ పంచాయితీల్లో లే అవుట్లు చట్టబద్దంగా ఉన్నాయో..? లేవో..? పరిశీలించాలని సూచించారు.

ప్రతీ 15 రోజులకు అక్రమ లే అవుట్ల వ్యవహారాన్ని పరిశీలించిన అనంతరం క్రమబద్దీకరించాలని స్పష్టం చేశారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్ను వసూళ్ల ప్రక్రియ సరిగా జరగకపోవటానికి గల కారణాలపై దృష్టి పెట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. పంచాయితీలు సొంతంగా ఆదాయాలు సమకూర్చుకునేలా ప్రణాళికలు రూపొందించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. డిసెంబరు 2 తేదీ నుంచి 21 తేదీ వరకూ చేపట్టే శానిటైజేషన్ కార్యక్రమంపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండి

స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులతో సీఎం జగన్ చర్చ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.