తన నివాసం నుంచి బయటకురాకుండా కట్టడి చేయాలని ఎస్‌ఈసీ రమేశ్ కుమార్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమంటూ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలుచేశారు. పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని మంత్రి తరపు న్యాయవాది కోరగా..ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు తుది ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రపతి పర్యటనకు వెళ్లేందుకు అభ్యంతరం లేదని ఎస్‌ఈసీ తరుపు న్యాయవాది తెలిపారు.
ఇదీ చదవండి: ఎస్‌ఈసీ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన మంత్రి పెద్దిరెడ్డి