ఉపాధి హామీ పథకంపై అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ నిధులతో గ్రామ సచివాలయాల నిర్మిస్తామన్నారు. కొత్తగా 4 వేల 892 నిర్మించనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 2,781 గ్రామసచివాలయాలకు పాలనా అనుమతులు ఇచ్చామని తెలిపారు. కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో రేపు సమీక్ష నిర్వహిస్తామని తెలిపిన మంత్రి... చేపట్టిన పనులు, పురోగతిపై అధికారులు నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుబంధంగా ఉపాధిహామీ పనులు ఉంటాయన్నారు. నరేగా కింద ప్రతి నియోజకవర్గానికి రూ.15 కోట్లు కేటాయింపు ఉంటుందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి ఘటన.. గవర్నర్‌కు తెదేపా ఫిర్యాదు