ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు అరుదైన గౌరవం దక్కింది. కీపింగ్ పేస్ టెక్నాలజీ- టెక్నాలజీ గవర్నెన్స్ ఎట్ క్రాస్ రోడ్స్ పేరుతో జరిగిన సమావేశంలో సెర్బియా, పోలాండ్, ఈస్టోనియా దేశాల ప్రధానమంత్రులతో పాటు వివిధ దేశాలకు చెందిన కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర స్థాయి ఆహ్వానితులు కేటీఆర్ మాత్రమే. ప్రపంచ నాయకులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి వివిధ అంశాలపై మాట్లాడుకునే అవకాశాన్ని ఈ సమావేశం ద్వారా వరల్డ్ ఎకనమిక్ ఫోరం కల్పిస్తుంది.
ఇవీ చూడండి: