కేంద్రానికి రూపాయి ఇస్తే... తిరిగి ఇస్తుంది అర్ధరూపాయే :కేటీఆర్ - మంత్రి కేటీఆర్ ముఖాముఖి
తెలంగాణకు ఈ ఆరేళ్లలో కేంద్రం చేసింది పూజ్యమని ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల సొమ్మును కేంద్ర ప్రభుత్వం... దేశంలో మరోచోట అభివృద్ధికి ఖర్చుచేస్తోందని ఈటీవీ భారత్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ విమర్శించారు. కేంద్రానికి తెలంగాణ రూపాయి ఇస్తే... అదే కేంద్రం తిరిగి రాష్ట్రానికి కేవలం అర్ధ రూపాయి మాత్రమే ఇస్తోందని ఉద్ఘాటించారు. అరకొరగా ఇస్తూ... మొత్తం తామే ఇస్తున్నామని భాజపా నేతలు నిరాధార వ్యాఖ్యలు చేస్తున్నారని వివరించారు.
ktr