తెదేపా అధినేత చంద్రబాబు తన స్వప్రయోజనం కోసమే అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. తెదేపా హయాంలో రూ. 800 కోట్లను కేవలం అమరావతి డిజైన్ల కోసమే ఖర్చు పెట్టారని.. వీటితోనే ఐదేళ్లు గడిపారని విమర్శించారు. రాజధాని రైతులకు కౌలు సరిగ్గా ఇవ్వలేకపోయారన్నారు.
వికేంద్రీకరణ వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందుతాయని మంత్రి అన్నారు. ఒక్కచోటే అభివృద్ధి జరగాలని ఎందుకు కోరుకుంటున్నారని.. రాజధానిపై ఇతర ప్రాంతాలవారికి హక్కు లేదా అని ప్రశ్నించారు. అమరావతి రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. ఉద్యమం చేసేవాళ్లు ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించాలని.. చంద్రబాబు, ఆయన అనుచరుల కోసం పోరాటం చేయవద్దని కన్నబాబు సూచించారు.
ఇవీ చదవండి..