తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయిలోని వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మంత్రి సురక్షింతగా బయటపడ్డారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం చింతూరు వద్ద హైదరాబాద్ నుంచి పాలకుర్తికి వెళ్తుండగా శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు కాగా.. జనగామ ఆస్పత్రికి తరలించారు. వారిని మంత్రి పరామర్శించారు. మృతుల్లో డ్రైవర్ పార్థసారథి(30), సామాజిక మాధ్యమాల బాధ్యుడు పూర్ణేందర్(27) ఉన్నారు. వాహనంలో ప్రయాణిస్తున్న గన్మెన్ నరేశ్, అటెండర్ తాతారావు, శివకు గాయాలయ్యాయి.
ఇవీ చూడండి:మరొకరితో ఉండగా భార్యను పట్టుకున్న భర్త