ETV Bharat / city

విశాఖకు పరిపాలనా రాజధాని వచ్చి తీరుతుంది: మంత్రి బొత్స - Minister Botsa on special status issue

ఎవరు ఎన్ని చెప్పినా.. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. విజయనగరంలో మాట్లాడిన ఆయన.. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Minister Botsa Satyanarayana
Minister Botsa Satyanarayana
author img

By

Published : Feb 13, 2022, 3:11 PM IST

ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో స్పష్టంగా ఉందని.. ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కలసిన ప్రతీసారి ఈ విషయాన్ని ప్రస్తావించామన్నారు.

విజయనగరంలో మాట్లాడిన మంత్రి.. ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం చేస్తామన్నారు. పరిపాలన వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. త్వరలోనే విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు అవుతుందని స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టరేట్​లో మంత్రి బొత్స అధికారులతో సమావేశం నిర్వహించారు. ఖరీప్ ధాన్యం కొనగోలు, మిల్లుల నుంచి బియ్యం సేకరణ వంటి పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండి

యెమెన్​లో ఐదుగురు ఐక్యరాజ్య సమితి ఉద్యోగుల కిడ్నాప్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.