లక్ష్మణ రేఖ దాటింది తాము కాదని... రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమారేనని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రులు లక్ష్మణ రేఖ దాటారని ఎస్‌ఈసీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
మేమెప్పుడూ రాజ్యాంగ, చట్ట ఉల్లంఘనకు పాల్పడలేదు. ఎస్‌ఈసీ భాష, వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. మా వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగేలా నిమ్మగడ్డ వైఖరి ఉంది. మాపై గవర్నర్‌కు లేఖ రాయడంపై సభాపతికి ప్రివిలేజ్ నోటీసు ఇచ్చాం. నిమ్మగడ్డ ఎన్నికల పర్యవేక్షణకు కడప వెళ్లారా.? హరికథలు చెప్పడానికి వెళ్లారా.? వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఎస్‌ఈసీ అక్కసు వెళ్లగక్కారు. గతంలో ఇలా ఎవరూ చేయలేదు. ఎందరు కలసి వచ్చినా ఎన్నికల్లో 90 శాతం పైగా స్థానాల్లో వైకాపా శ్రేణులు గెలుస్తారు - బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి
ఇదీ చదవండి
'తీవ్ర పరిణామాలు తప్పవు'... సీఎస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ హెచ్చరిక